లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులముందుకు వకీల్ సాబ్ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రేజీ డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ కె చంద్ర ఒంటి దర్శకులను లైన్ లో పెట్టేసాడు పవన్. అయితే ఇందులో హరీష్ శంకర్ తో గతంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో సినిమా వస్తుండటం తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ తో చాలా సేపు ముచ్చటించారు. ఇదే విషయాన్ని స్వయంగా చెబుతూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారని వేసవి తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వస్తానని పవన్ మాటిచ్చినట్టు తెలుస్తుంది.
Had a long and productive meeting with our Power Star @PawanKalyan …..this is not just an excitement but an ignition to a huge start ……
Love you
Power Star 🤗🤗 …… @MythriOfficial @ThisIsDSP @DoP_Bose pic.twitter.com/hkKnH8KvAK— Harish Shankar .S (@harish2you) January 1, 2021