టాలీవుడ్ పవర్ స్టార్, ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ సినీరంగ ప్రవేశం ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయిసినిమాతో అనుకుంటారు. కానీ పవన్ సినిమాల్లోకి అడుగుపెట్టింది దిగ్గజ దర్శకుడు కే.విశ్వనాథ్ దర్శకత్వంలోనని అతికొద్దిమందికే తెలుసు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాలో విశ్వనాథ్ డైరెక్షన్లో పవన్ మొట్ట మొదటిగా తన గొంతు వినిపించారు. పవన్ అనుకోకుండానే.. శుభలేఖ సినిమాలో డబ్బింగ్ చెప్పారు.
అప్పట్లో అంటే చిరంజీవి హైదరాబాద్ కు షిప్ట్ కాకముందు మద్రాసులో నివాసం ఉండేవారు. ఆ సమయంలో చిరంజీవి కె. విశ్వనాథ్ కాంబోలో తొలి సినిమా శుభలేఖ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
అప్పుడు పవన్ వయసు పదహారేళ్లు ఉంటాయి. స్కూల్ అయిపోగానే డబ్బింగ్ థియేటర్‌కు వెళ్లిన పవన్‌ను విశ్వనాథ్ చూశారట. “మంచినీళ్లు ఎక్కడ సార్” అనే ఓ చిన్న డైలాగ్ ను పవన్ తో చెప్పించారు. ఇప్పటికీ ఆసీన్లో పవన్ గొంతు సినిమాలో వినిపిస్తుంది.
అదే సినీ రంగంలోకి ఆయన ఫస్ట్ ఎంట్రీ. ఒక రకంగా చెప్పాలంటే పవన్ సినీ రంగ ప్రవేశం..కళాతపస్వి కె. విశ్వనాథ్ సినిమాతో జరిగిపోయిందని చెప్పవచ్చు. కె. విశ్వనాథ్ మరణించడంతో పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఆయనతో అనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.