జీనా హైతో మర్నా సీకో.. కదం కదం పర్ లడ్నా సీకో అంటూ ఉస్మానియాకే ఉద్యమ పాఠాలు నేర్పిన విద్యార్థి ఉద్యమ కెరటం జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా జార్జిరెడ్డి.
ఉస్మానియాలో గోల్డ్‌మెడలిస్ట్ అయిన జార్జిరెడ్డి ఎంత మేధస్సు ఉందో, అంతే పోరాట పటిమ కలిగిన నాయకుడు. అందుకే జార్జిరెడ్డి బయోపిక్ ట్రైలర్ రిలీజ్ కాగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కితాబిచ్చాడు. అద్భుతంగా తీశారు… త్వరలో జార్జిరెడ్డి టీంను కలుస్తా అని ప్రకటించాడు పవన్.
ఇక మరో మెగా హీరో నాగబాబు కూడా జార్జిరెడ్డి ట్రైలర్, జార్జిరెడ్డి సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ… త్వరలోనే జార్జిరెడ్డి టీంతో మీ ముందుకు వస్తున్నా, ఇది నిజమైన బయోపిక్ అంటే… అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాదు జార్జిరెడ్డి బయోపిక్‌లో పవన్ కాని, వరుణ్ కాని నటించాలని ఉండేది ఇంతలోనే జార్జిరెడ్డి బయోపిక్ తీశారు అంటూ తెలిపారు.
అయితే, ఈ మెగా హీరోలంతా ఒకేసారి జార్జిరెడ్డి ఈవెంట్‌లో కలవబోతున్నారు. జార్జిరెడ్డి సినిమా నవంబర్22న రిలిజ్ చేయబోతుండగా… ఈ సినిమా ప్రీరిలిజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్, నాగబాబు తదితరులు హజరవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా టాక్ వినపడుతోంది.
మెగా ఫ్యామిలి అంతా జార్జిరెడ్డి ట్రైలర్‌కు కితాబివ్వటం, సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుందని చెప్పటంతో… సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ కలెక్షన్లపై కూడా ఉంటుందని, ఓ రియల్ హీరో స్టోరీకి పవర్ స్టార్ చరిష్మా తోడవనుంది అంటూ మెగా అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:
తిరుపతి సుప్రభాతం కూడా ఇంగ్లీషులో: పవన్