పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తరువాతగా అమితాబ్ నటించిన పింక్ సినిమా రీమేక్ తో వకీల్ సాబ్ గా వస్తున్న సంగతి తెలిసిందే. దానితో పాటు క్రిష్ దర్శకత్వం లో కూడా మూవీ కి ఒకే చెప్పాడు. మరో పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బంపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కూడా పవన్ ఒకే చెప్పేశాడు.
ఇప్పుడు హరీష్ శంకర్ తో సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పవన్ హరీష్ లా కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ‘ఇప్పుడే మొదలైంది’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. సోమవారం గబ్బర్ సింగ్ సినిమా 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. అందులో ‘ఇప్పుడే మొదలైంది’ అంటూ రెండు ట్వీట్ లలో రాసుకొచ్చారు. రెండు ట్వీట్ లలో కూడా ‘ ఇప్పుడే మొదలైంది’ అనేది హైలెట్ చేయటం గమనార్హం.