భవన నిర్మాణ కార్మికులకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఈ నెల 15 , 16 తేదీల్లో ఆహార శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకలితో, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్మికులకు అండగా మేమున్నామని చెప్పటానికే ఈ కార్యక్రమం చేపడుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవటం మన దురదృష్టమన్నారు.
పనులకోసం వచ్చే అడ్డా కార్మికులకు అడ్డా దగ్గరే శిబిరాలను ఏర్పాటు చేస్తామని, మా వనరులు పరిమితం కావచ్చు కానీ మాకు చేతనైన సాయం చేస్తాము. అది చూసైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికులను ఆదుకుంటుందని ఆశిస్తున్నాము. భవన నిర్మాణ కార్మికులకు జనసైనికులు ఎప్పుడు అండగా ఉంటారు. మేము చేపడుతున్న కార్యక్రమానికి ఏ పేరైన పెట్టండి, ఏ రంగైనా వేసుకోండి అంటూ పవన్ విజ్ఞప్తి చేశారు.