సినీనటి మీరా చోప్రా తండ్రిపై ఇద్దరు దుండగులు కత్తితో దాడికి యత్నించారు. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా తెలిపింది. వివరాల్లోకి వెళ్తే న్యూఢిల్లీలోని పోలీస్ కాలనీలో వాకింగ్ చేస్తున్న సమయంలో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కత్తితో బెదిరించి తన తండ్రి వద్దనున్న సెల్‌ఫోన్ లాక్కుపోయారని ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. ట్వీట్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీస్ కమీషనర్‌ను ట్యాగ్ చేసింది.
ప్రస్తుతం మీరా చోప్రా సెక్షన్ 375 సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు ఆమె నటించిన మొగలి పువ్వు అనే తెలుగు సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. గతంలో పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో ఈ బామ నటించింది.