ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్… పింక్ సినిమా రీమేక్‌తో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి గాను పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయల రెమ్యునిరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. మొత్తం 70 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా లో 50 కోట్లు పవన్ కి పోగా మిగతా 20 కోట్లతో రెండు నెలల్లో సినిమాని పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు.
ఇప్పటికే ఈ సినిమాలో నివేత థామస్, అంజలి, అనన్య లను తీసుకున్నట్టు తెలుస్తోంది. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమా అఖండ విజయం సాధించిన సంగతి తెలిసింద. పింక్‌ను తమిళ్ లో అజిత్ హీరో గా రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం సాధించటంతో తెలుగు లో పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి సినిమా తెరకెక్కించడానికి సిద్దం అవుతున్నారు దిల్ రాజు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ కూడా స్టార్ట్ చేశారట.
పింక్ సినిమాకు తెలుగు టైటిల్‌గా లాయర్ సాబ్ అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.