వచ్చే ఎన్నికల్లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్న కసితో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిందీ పింక్ మూవీ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ లో చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది. ఇక డైరెక్టర్ క్రిష్ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ సినిమాలు ఫిక్స్ అయ్యాయి.
అయితే, తెలుగులో బడా ప్రొడ్యూసర్స్ అంతా మలయాళ బ్లాక్ బాస్టర్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చూశారట. దీంతో ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం వారంతా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందులో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ నటించే విధంగా ఒప్పిస్తే కాసుల వర్షం కురుస్తుందని నమ్మకంగా ఉన్నారట.
పవన్ కూడా సరైన దర్శకుడి చేతిలో కథ పడితే మూవీ చేసేందుకు సుముఖంగానే ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.