కర్నూలు: జన సేనాని పవన్ కల్యాణ్ శవయాత్ర చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతల్ని అరెస్టు చేయాలని జనసేన కార్యకర్తలు గాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష చేపట్టారు. రాజధాని అమరావతిని మార్పు చేస్తే ఉద్యమిస్తామని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్‌ను వ్యతిరేకిస్తూ కొద్దిరోజుల క్రితం రాయలసీమ విద్యార్థి జేఏసీ నాయకులు శవయాత్ర చేశారు. పవన్ పూటకో మాట మాట్లాతున్నారని, గత ఎన్నికల ప్రచారంలో నా మనసులో రాజధాని కర్నూలు అని చెప్పి ఇప్పుడు అమరావతిని కదిలిస్తే ఉద్యమిస్తామని చెప్పడం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం అని విద్యార్థి జేఏసీ నిరసన తెలియజేసింది. ఈ కార్యక్రమంపై స్పందించిన రాయలసీమలోని పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు దీనికి పోటీగా మరో నిరసన చేశారు. దీనికి అనుమతి తీసుకోలేదని చెప్పి పోలీసులు యాక్ట్ 30 ప్రయోగించి కేసు నమోదు చేశారు.