టాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ బెంచ్ మార్క్ హీరోస్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. భీమ్లానాయక్ సినిమా వచ్చి దాదాపు 11 నెలలు గడుస్తోంది. రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల పవన్ ఫ్యాన్స్ కి సెలబ్రేటింగ్ స్పేసు, సెలెబ్రేకింగ్ న్యూస్ కూడా కరువయ్యాయి. మేకింగ్ లో ఉన్న ఒక్క వీరమల్లు మూవీ నుంచి కూడా పెద్దగా అప్డేట్స్ రావడంలేదు.
ఈ నేపథ్యంలో రీరిలీజ్ అయిన ఖుషి సినిమా స్టన్నింగ్ కలెక్షన్స్ ఇచ్చింది. దీంతో అభిమానుల గుండెల్లో పవన్ రేంజ్ ఏంటో మరోసారి రుజువు చేసినట్టైంది. ఈ మధ్య టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతేడాది పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘జల్సా’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయగా… తాజాగా న్యూయర్ సందర్భంగా పవన్ ‘ఖుషి’ సినిమా రీ రిలీజ్ చేశారు.
ఈ సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లవుతోంది. అయినా సరే దీని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాకు వచ్చినట్లు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. దీంతో రీ రిలీజ్ కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అయ్యాయి. విడుదల చేసిన ప్రతిచోటా సినిమాకు నీరాజనం పలికారు.
దీంతో తొలిరోజు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.4.15 కోట్లు వచ్చాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.62 కోట్ల వసూళ్లు దక్కాయి. రీరిలీజ్ అయిన చిత్రాల్లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఖుషి’ రికార్డు సాధించింది.
ఇప్పటివరకు రూ. 3.20 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న తన ‘జల్సా’ రికార్డునే పవన్ బ్రేక్ చేశాడు. మహేశ్ బాబు ‘పోకిరి’ చిత్రం రీరిలీజ్ లో రూ. 1.52 కోట్లతో మూడో స్థానంలో ఉన్నట్టు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.