పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండటంతో వేదనితెరకు దూరం అయిన సంగతి తెలిసిందే . తాజాగా బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రిమేక్ లో పవన్ నటిస్తున్నారు. ఆ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే వకీల్ సాబ్ మొదటి షెడ్యూల్ ముగియటంతో క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకి పవన్ ఒకే చేసి, షూటింగ్ లో కూడా పాల్గొన్నారని సమాచారం. ప్రస్తుతం జనసేన పార్టీ మీటింగ్ లో ఐదు రోజులు పాటు పవన్ షూటింగ్ కు విరామం ఇచ్చారు.
అయితే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో డిఫ్రెంట్ మూవీ అని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఉన్నవాడి దగ్గర దోచుకుని లేనివాడికి పంచిపెడుతూ ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ వార్త షికార్లుయ్ కొడుతుంది. డిఫరెంట్ గా ‘విరూపాక్షి’ అనే టైటిల్ ను దర్శకుడు క్రిష్ అనుకుంటున్నాడట. దానికి పవన్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది.
Advertisements
కథ నచ్చటంతో సినిమాకు సంబందించిన పూర్తి బాధ్యతలను పవన్ క్రిష్ కు వదిలేసాడట. సెట్స్ లో కూడా క్రిష్ చెప్పిన విధంగానే పవన్ నడుచుకుంటున్నాడట. పాత్రలతో సంబంధం లేకుండా కథనే నమ్ముకుని సినిమాలు తీసే క్రిష్ పవన్ మరి ఏవిదంగా చూపిస్తాడో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
అయితే, తొలివెలుగు ముందే చెప్పినట్లు పాలమూరు జిల్లా పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ సినిమా లైన్ ఉండబోతుంది.