పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన దర్శకనిర్మాతలు నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు.
రాబోయే వారంలో గట్టి ప్రమోషన్లను చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. చివరి రోజు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తోంది. పవర్‌స్టార్ ఖాకీ డ్రెస్ లో ఉండగా దర్శకుడు సాగర్ కె చంద్ర, డిఓపి రవి కె చంద్రన్ లు పక్కన కనిపించారు.
టీజర్ విడుదల కాక ముందే సినిమాపై భారీ హైప్ నడుస్తోంది. తమన్ సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు.
త్రివిక్రమ్, పవర్‌స్టార్ కాంబినేషన్ కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.