మెగా ఫ్యాన్స్, మంచు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇరు వర్గాలు ఎవరికి వారిని ట్రోల్ చేసుకుంటూ పోస్టులు పెడుతుంటారు. ‘మా’ ఎన్నికల తర్వాత నుంచే ఈ వార్ పీక్స్ కు చేరింది. అయితే.. మెగా, మంచు ఫ్యామిలీలకు సంబంధించిన హీరోలు కలవడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్, మంచు విష్ణు ఒకే వేదికపై కనిపించారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఉభయకుశలోపరి చెప్పుకున్నారు.
అశోకవనంలో అర్జునకళ్యాణం హిట్ తర్వాత విశ్వక్.. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం జరిగింది. దీనికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి క్లాప్ ఆయనే కొట్టారు.
ఇంకో విషయం ఏంటంటే.. ‘మా’ ఎన్నికల సమయంలో నానా తిట్లు తిట్టుకున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ ను కలిసిన విష్ణు కాసేపు మాట్లాడాడు.
త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా రాస్తున్నాడు.