పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ సాయి పల్లవి హీరోయిన్స్ గా నటించనున్నారని సమాచారం. పవన్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్, రానాకు జోడిగా సాయిపల్లవి నటించినబోతున్నారట.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పవర్ స్టార్ పంచెకట్టులో మెరిశారు. కార్ వ్యాన్ నుండి పంచే కట్టులో వైట్ షర్ట్ వేసుకొని వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూసిన అభిమానులు పవర్ స్టార్ లెక్కే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.