పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. బోనీ కపూర్, దిల్ రాజుతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తాడని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పింక్ రీమేక్ తెరకెక్కుతుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరిలో సెట్స్ పైకి వెళ్లడమే లేట్ అనుకుంటున్న టైములో పవన్ కళ్యాణ్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ‘మీరు మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయిగా’ అంటూ ఒక మీడియా ప్రతినిధి అడగగా, దానికి పవన్ ఇచ్చిన సమాధానం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
రాజకీయాలలో ఉన్నవారు ఇతర వ్యాపారాలు చేసుకోవట్లేదా? జగన్ జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా? అంటూ మీడియా ప్రతినిధిని ఎదురు ప్రశ్నించిన పవన్, సినిమాల్లో నటించడం తప్ప తనకి మరేమి రాదని, అయినా తాను సినిమాలలో నటిస్తానా లేదా అన్నది తనకే ఇంకా క్లారిటీ లేదని పవన్ బాంబ్ పేల్చాడు. ఈ మాట విన్న మెగా అభిమానులు, అదేంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసిన తర్వాత, తాను సినిమాల్లో నటిస్తున్నట్లు తనకే క్లారిటీ లేదంటున్నాడు అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి పవన్ ఓకే చెప్పకుండానే బోనీ కపూర్ స్టేట్మెంట్ ఇచ్చాడా? లేక పవన్ ని ఒప్పిస్తానని దిల్ రాజు మాటిచ్చాడు కాబట్టి అఫీషియల్ స్టేట్మెంట్ బయటకి వచ్చిందా అనేది తెలియదు కానీ పవన్ మాత్రం తనకి క్లారిటీ లేదని తేల్చి చెప్పాడు. అసలు ‘పింక్’ రీమేక్ కు పవన్ ఒప్పుకోకుండా ఇంత హడావిడి ఎందుకు జరుగుతోంది అన్న విషయం సమాధానం లేని ప్రశ్నలుగా మారుతోంది.. అయితే ఎప్పుడు తను సినిమాల్లో నటించనున్నాడు అనే వార్త బయటకి వచ్చినా, వెంటనే కాదని క్లారిటీగా పవన్ కళ్యాణ్… ఈసారి మాత్రం రాజకీయాల్లో ఉన్న వాళ్లు వ్యాపారాలు చేసుకోకూడదా అంటూ ఎదురు ప్రశ్నించడంతో, ఇప్పుడు కాకపోయినా ఆయన మళ్లీ సినిమాల్లో అవకాశం అయితే ఉందని అర్ధమవుతోంది.