మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న సాయిధరమ్ తేజ్ అతి వేగం కారణంగా ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సాయిధరమ్ తేజ్.
అయితే హాస్పిటల్ కి జనసేన అధినేత సాయి ధరమ్ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ చేరుకున్నారు. సాయి ధరమ్ తేజ్ పరిస్థితిపై వైద్యులను ఆరా తీసి ఆయన ఆరోగ్య పరిస్థితిని కనుక్కున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ… సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నాడని…కోలుకుంటున్నాడని ఎవరూ భయపడాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు.