మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక నిశ్చితార్ధం జరిగిపోయింది. ఎవ్వరికీ చెప్పకుండా ఈ విషయం లో మెగా ఫ్యామిలీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తనకు కాబోయే వాడు అంటూ నిహారిక పరిచయం చేసిన చైతన్యతోనే నిశ్చితార్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లుఅర్జున్, రాంచరణ్, చిరంజీవిలో, సాయిధరమ్ తేజ్, చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ ఇలా అందరూ కనిపించారు. కానీ సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలలో మాత్రం పవర్ స్టార్ ఎక్కడా దర్శనమివ్వలేదు. దీనితో పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ పవన్ ఫ్యాన్స్ నాగబాబు ను క్వశ్చన్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కి చెప్పారా… చెప్పిన రాలేకపోయారా… వచ్చిన ఫోటో తీసుకోలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంతకు వచ్చాడా? ఎందుకు రాలేదో తెలియాలంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు స్పందించాల్సిందే.