పవన్ కళ్యాణ్.ఈపేరు ఎంతో మంది అభిమానులకు మంత్రం. మెగాస్టార్ తమ్ముడిగా సినీరంగంలో అడుగు పెట్టి బాక్సాఫీసులు కొల్లగొట్టాడు. తనదైన మేనరిజంతో పవన్ కళ్యాణ్ కాస్తా పవర్ స్టార్ అయ్యాడు.
పవన్ కట్అవుట్ కనబడితే చాలా కంటెంట్ తో పనిలేదు సినిమా కలెక్షన్ల మోతమోగుతుంది. సినిమాలు చేసినా లేకున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గని క్రేజ్ అతని సొంతం. పవన్ కళ్యాణ్ 1996లో రిలీజ్ అయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలలో నటించారు.అయితే ఆయన 24 ఏళ్ల సిని జీవితంలో పవన్ నటించిన సినిమాలు 25 మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కొన్ని చిత్రాలను మధ్యలోనే ఆపేశారు. అలా మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సత్యాగ్రహి :
ఈ సినిమాకి టైటిల్ తోనే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం చేయాలనుకుని, కథను సిద్దం చేసుకొని సత్యాగ్రహి అని టైటిల్ పెట్టారు. అయితే జానీ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాను ఆపేశారు. కాగా ఈ సినిమా టైటిల్ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు మీదనే రిజిస్టర్ అయ్యి ఉండడం విశేషం.
దేశి:
ఈ సినిమాని దేశభక్తి కాన్సెప్ట్ తో పవర్ స్టార్ తెరకెక్కించాలనుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
కోబలి:
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బాగా నచ్చిన సినిమాలలో కోబలి ఒకటి. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సోసియో ఫాంటసీ సినిమాగా కోబలి తెరకెక్కించాల్సి ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించగానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కారణాలైనా కానీ మూవీ స్క్రిప్ట్ దశలోనే పక్కకు వెళ్లిపోయింది.
ప్రిన్స్ ఆఫ్ పీస్:
విభిన్నంగా ఆలోచించే పవన్ కొన్ని డిఫరెంట్ సబ్జక్ట్స్ ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకటి ప్రిన్స్ ఆఫ్ పీస్. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో జీసస్ చరిత్ర ఆధారంగా ఈ మూవీని 2010 లో మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా జెరోసలేం లో ఒక షెడ్యూల్ అయిన తరువాత కూడా ఆగిపోయింది.
చెప్పాలని ఉంది:
ఏం.ఎం.రత్నం శ్రీసూర్య మూవీస్ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమాను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్, హీరోయిన్ అమీషా పటేల్‌పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. మూవీ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఎందుకో ఈ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత ఇదే స్టోరీతో రామోజీరావు నువ్వే కావాలి సినిమాగా తీశాడు. ఇందులో తరుణ్, రిచా నటించారు. ఇక ఈ చిత్రం ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే.