జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సర్జరీ చేయాలని సూచించారు డాక్టర్లు. గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్‌లో అయిన వెన్నుపూస గాయం మరింత పెద్దదిగా తయారైంది. ఇలాగే వదిలేస్తే ప్రమాదమని, వెంటనే సర్జరీ చేయాలని సూచించారు డాక్టర్లు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణే ప్రకటించారు. ఇన్నాళ్లు సంప్రదాయ వైద్యం చేయించుకుంటున్నా తగ్గటం లేదు. అందుకే గత మూడు రోజులుగా బయటకు ఎక్కడికి వెళ్లటం లేదని తెలిపారు.