పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. అందులో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పై వున్నాయి.
ఇవి కాకుండా మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పట్ల కొంత మంది దర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందుకు కారణం పవన్ కండిషన్స్ అని తెలుస్తోంది.
పవన్ కేవలం 60 రోజులు మాత్రమే కాల్ షీట్ ఇస్తున్నారట. ఆసమయంలోనే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చెబుతున్నాడట.
దీనికోసం దర్శక నిర్మాతలు ఉరుకులు పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అందుకే వారందరూ కొంచెం పవన్ ని ఇంకోసారి ఆలోచించాలని కోరుతున్నారట. మరి పవన్ దర్శకుల రిక్వెస్ట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.