పవన్ కళ్యాణ్ ఇదివరకు గుబురు గెడ్డంతో కనిపించాడు. ఆయన పార్టీ సమావేశాలకు కూడా అదే స్టైల్ లో వెళ్ళేవాడు. పవన్ అలా కనిపించడంతో నటి మాధవి లత తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. పవన్ అంటే నీట్ షేవ్.. ముచ్చటైన నవ్వు అని… అలాంటిది పవన్ ఇలా కనిపించడం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అభిమానులైన పవన్ కు చెప్పిండి అంటూ పోస్ట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ మాధవి లత పోస్టు చూశాడో లేక అభిమానులు ఆయనను స్టైల్ చేంజ్ చేయాలనీ చెప్పారో లేక యాదృచ్చికమో తెలియదు కానీ పవర్ స్టార్ గురువారం నాటి పార్టీ సమావేశాల్లో నీట్ షేవ్ తో కనిపించారు.
ఇదిలా ఉండగా.. ఆయన గెడ్డం పెంచింది పింక్ చిత్రం కోసమట. ఈ సినిమాలో పవర్ స్టార్ బందిపోటు పాత్రలో కనిపిస్తుండటంతో ఆయన గెడ్డం పెంచారని అంటున్నారు. పింక్ సినిమాలో ఆ పాత్ర పని అయిపోవడంతో ఆయన నీట్ షేవ్ చేసుకున్నారని చెబుతున్నారు. మరో విషయమేంటంటే.. ఆయన క్రిష్ సినిమాలో నటిస్తుండటంతో క్లీన్ షేవ్ చేసుకున్నారని అంటున్నారు.
Advertisements