బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇక దీని తర్వాత వరుస సినిమాలకు పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. అయితే వాటిలో ఏ సినిమాని మొదట సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనే దానిపై క్లారిటీ లేదు.
ఇక తాజా సమాచారం ప్రకారం అయ్యప్పన్ కొషియం రీమేక్ ను మొదట సెట్స్ పైకి తీసుకెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఈ నెల 21న ప్రారంభించనున్నారని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తారని తెలుస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్రెడ్డి లైన్ ఉన్నారు