పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ,హరీష్ శంకర్ సురేందర్రెడ్డి లతో సినిమాలు చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలే కాకుండా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాగర్ కే చంద్ర దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్.
కింగ్ ఆఫ్ ఆటిట్యూడ్ తెలుగు సినిమా పోలీస్ ఆఫీసర్ మరోసారి హై వోల్టేజ్ రోల్ తో రాబోతున్నారు అంటూ సినిమా ను కూడా అనౌన్స్ చేశారు. కాగా ఇది మలయాళ చిత్రం అయ్యప్పన్ కొషియం రీమేక్ అని ప్రకటన చేశారు. అయితే ఈ మూవీ కి సంబంధించి ఓపెనింగ్ కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లో జరగనున్నాయి. జనవరి 2 నుంచి హైదరాబాదులో షూటింగ్ ప్రారంభించనున్నారు. వీలైనంత తొందరగా ముగించి ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.