పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో ఇన్నింగ్స్‌లో వకీల్‌సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిందీ పింక్ సినిమా రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంలో ఓ పాటను ఇప్పటికే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 15న విడుదల కావాల్సి ఉంది. పవన్ కూడా ఓ వైపు జనసేన కార్యక్రమాల్ని చూసుకుంటూనే మరోవైపు షూటింగ్‌లో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.
అయితే, ప్రపంచాన్ని భయపడెతోన్న కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. ఇప్పట్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కూడా కనపడటం లేదు. భారత్‌లో రోజు రోజుకు ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమాపై పడబోతున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ ఇంకా పూర్తి చేయాల్సి ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మిగిలి ఉండటంతో మేలో వకీల్‌సాబ్ ప్రేక్షకుల ముందుకు రావటం అనుమానమే అంటోంది ఫిలింనగర్. అయితే… దీనిపై నిర్మాత దిల్ రాజు కానీ, పవన్ కానీ ఎక్కడా స్పందించలేదు.