రాజకీయాల్లో బిజీగా ఉండి గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… పింక్ రీమేక్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే… 2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసే ఆలోచనతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలకు పవన్ ఓకే చెప్పగా, నాలుగో సినిమాకు కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది.
పింక్ సినిమా రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో సినిమా, డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమాలు ఇప్పటికే ఓకే అయ్యాయి. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది మొదటి కల్లా పూర్తిచేయనున్నారు పవన్. నాలుగో సినిమా మరింత కమర్షియల్‌గా ఉండబోతుంది. గోపాల గోపాల సినిమా డైరెక్టర్ డాలీతో సినిమా చేయనున్నాడు పవన్. ఇప్పటికే డాలీ చేసిన కథకు ఒకే చెప్పటంతో… ఫైనల్ డ్రాఫ్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట డాలీ. ఫైనల్‌గా ఓ సారి కథ విన్నాక ప్రొడ్యూసర్స్‌తో పాటు సినిమా క్రూ ఫైనల్ కాబోతుంది.