వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అయ్యపునం కోష్యిం రీమేక్ లో నటిస్తున్న పవన్ ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అంతేకాదు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
పవన్-హరీష్ శంకర్ సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. పైగా ఈ సినిమా దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.