పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు పొలిటికల్ గా కూడా అదే స్పీడ్ ను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు చేశారు మేకర్స్. అయితే అందులో ఎక్కడా కూడా పవర్ స్టార్ అనే పేరు కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ అని మాత్రమే చెప్పుకొచ్చారు. ఇదే విషయమై కూడా ఫ్యాన్స్ చర్చించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం…పవన్ కళ్యాణ్ ఈ టాగ్ ను వాడొద్దని చెప్పారట. అందుకే హరీష్ శంకర్ కూడా తన 28వ సినిమాకి పవన్ కళ్యాణ్ 28వ చిత్రం అని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు.