పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళ మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. అయ్యపునం కోష్యిం మూవీలో పవన్, దగ్గుబాటి రానాలు నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి భయటకొచ్చిన వీడియో వైరల్ గా మారింది.
ఓ అల్యూమినీయం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్ లో సినిమా షూటింగ్ నడుస్తుంది. రానా ఇంకా సెట్ లో జాయిన్ కావాల్సి ఉండగా, మురళీ శర్మ, సముద్రకనిలు కూడా మూవీలో ఉన్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ దీపావళికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.