ఆంద్రప్రదేశ్ బీజేపీ లో పవన్ ఫోన్ చిచ్చుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇసుక కొరత పై తాను తలపెట్టిన లాంగ్ మార్చ్ కు ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి పవన్ ఆహ్వానించారు, దానికి కన్నా కూడా సానుకూలంగా స్పందించి లాంగ్ మార్చ్ కు హాజరవుతనాని చెప్పారు. ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీ లో చిచ్చురేపుతుంది.
కన్నా లక్ష్మీనారాయణ హాజరవుతాను అనడంపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కన్నా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు ఎలా వెళ్తారు అని భహిరంగంగ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని బయట పెట్టారు. మొదటి నుంచి ఇసుక కొరతపై పోరాటం చేస్తుంది బీజేపీ , గవర్నర్ కు లేఖ రాసింది కూడా బీజేపీ అని , కన్నా లక్ష్మీనారాయణ గారు పవన్ లాంగ్ మార్చ్ కు బీజేపీ వెళ్లాల్సిన అవసరం లేదు అని ట్విట్ చేయడం ఏపి బీజేపీ లో కలకలం రేపింది. పార్టీ అధ్యక్షుడు హాజరవుతాం అని చెప్తుంటే, మరో నేత మాత్రం బీజేపీకి ఆ అవసరం లేదు అని అంటున్నారు. పవన్ లాంగ్ మార్చ్ కు హాజరు పై పార్టీలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.