విశాఖపట్నం లో నవంబర్ మూడున తలపెట్టిన లాంగ్ మార్చ్ కు అన్నిపార్టీ ల మద్దతు కూడగడుతున్నారు పవన్ కళ్యాణ్ . ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు ఫోన్ చేసి పవన్ మాట్లాడారని సమాచారం. లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని పవన్ కోరగా కన్నా దానికి అంగీకరించినట్టు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తినడానికి తిండి కూడా లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులతో ఉంటున్నారని, లాంగ్ మార్చ్ ద్వారా ప్రభుత్వానికి తన నిరసన తెలపాలని పవన్ నిర్ణయించారు.