కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ – సుజిత్ #OG మూవీ నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది..ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా సంచలనం సృష్టిస్తున్నాయి..పవన్ కళ్యాణ్ ఈ పూజ కార్యక్రమానికి సన్నని గడ్డం తో హూడి వేసుకొని సెట్స్ లోకి అడుగుపెట్టాడు..అంత స్టైలిష్ లుక్ లో పవర్ స్టార్ ని చూసిన అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. నెట్టింట్లో #TheyCallHimOg#Firestormlscoming అనే ట్యాగ్స్ ని ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
రీసెంట్ టైం లో పవన్ కళ్యాణ్ ని ఇంత స్టైలిష్ గా అభిమానులు ఎప్పుడు చూడలేదు కాబట్టి..వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలు సీరియస్ సబ్జక్ట్స్ అవ్వడం తో ఇలాంటి లుక్స్ ని అభిమానులు బాగా మిస్ అయ్యారు..ఈ పూజ కార్యక్రమానికి అల్లు అరవింద్ , దిల్ రాజు మరియు సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాతలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఇక #OG మూవీ విశేషాలకు వస్తే ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు..ముందుగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ ని తీసుకుందాం అనుకున్నారు..కానీ అతని చేతిలో ప్రస్తుతం పది సినిమాలు ఉన్నాయి..కాస్త సమయం కావాలి అని అడగడం తో సుజీత్ థమన్ ని ఎంచుకున్నాడు..#RRR మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా స్కేల్ లోన్ నటీనటులు కూడా ఇందులో ఉంటారు..అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ లేట్ గా ఉంటుందని సమాచారం..కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా గుర్తుంది కదా..ఆ తరహా స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కనుంది..చూడాలి మరి కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే సుజిత్ ఈ సినిమాలో కళ్యాణ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనేది.