వచ్చే ఎన్నికల్లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకున్న పవన్ స్పీడ్ కు కరోనా వైరస్ బ్రేకులు వేసింది. లాక్ డౌన్ సడలింపులు వచ్చినా ఇప్పటి వరకు ఇంకా షూటింగ్ ప్రారంభమే కాలేదు. అయితే వచ్చే వారం నుండి పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూట్ మొదలు కానుండగా, అక్టోబర్ నుండి పవన్ జాయిన్ కాబోతున్నారు. పవన్ 20రోజుల పాటు సమయం ఇస్తే ఈ సినిమా షూట్ పూర్తికానుంది.
ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉండగా… సినిమా క్రూ భారీగా అవసరం ఉండటంతో కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు వెయిట్ చేయాలని నిర్ణయించారు. ఈలోపు టైం వేస్ట్ చేయుకుండా మలయాళం మూవీ అయ్యపురం కోష్యిం మూవీ రీమేక్ ను పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయ్యారని సమాచారం. దీంతో ఆ సినిమా బాధ్యతలు చూస్తున్న త్రివిక్రమ్ పై పవన్ ఒత్తిడి పెంచుతున్నారని టాక్ వినిపిస్తుంది. కథ ఇప్పటికే రెడీ కాగా, డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉంది. హారికా హాసిని క్రియేషన్స్ అధినేత ఇప్పటికే పవన్ తో సమావేశం అయ్యారు.
గోపిచంద్ మలినేనిని డైరెక్టర్ గా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. డైరెక్టర్ ఫైనల్ కాగానే… సినిమాలో నటీ నటులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఓ కీలక రోల్ కోసం విజయ్ సేతుపతితో ఇప్పటికే త్రివిక్రమ్ టీం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా పవన్ ఒత్తిడి తెస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్.