పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి చేస్తున్న రీమేక్ అయ్యప్పనుమ్ కోషియుమ్. ఈమూవీ షూటింగ్ ఇప్పటికే స్పీడ్‌గా సాగుతోంది. అయితే ఈ మూవీ టైటిల్ విషయంలో ఇప్పటికీ చాలా డైలామా ఉంది. పవన్ పేరు ఒక్కటే వచ్చేలా పెడతారా లేక.. రానాను కలుపుకొని సెట్ చేస్తున్నారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్‌కు తెరదించేందుకు సిద్ధమవుతోంది మూవీ యూనిట్. తాజాగా ఇందుకు సంబంధించిన అప్డేట్ను అందించింది.
స్వాతంత్ర దినోత్సవం రోజున ఉదయం 9.45గంటలకు ఈ సినిమా టైటిల్, అలాగే పవన్ కల్యాణ్ రోల్‌కు సంబంధించిన గింప్స్‌ని రానుందని ప్రకటించింది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్లో కూడా పవన్ లుంగితో స్టైల్‌తో వెళ్తున్న ఓ పిక్‌ను షేర్ చేసింది మూవీ టీం. దీంతో అప్పుడే అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లిపోయాయి.