పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలలో తిడుతూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. కాగా ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి సందడి తో మెగా కుటుంబం మొత్తం ఉదయ్ పూర్ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉదయపూర్ కి బయలుదేరారు. ఈరోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయపూర్ బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఇప్పటికే చిరంజీవి రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు ఉదయపూర్ కు చేరుకున్నారు.