సోషల్ మీడియాలో అంతే! ఎవ్వరికీ బెదరదు.. ఎవ్వర్నీ వదలదు. తెలంగాణలో విష జ్వరాలతో చస్టుంటే టీఆర్ఎస్‌లో వర్గ పోరాటాలపై నిన్నటివరకు నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. తాజాగా యాదాద్రిలో కేసీఆర్ బొమ్మ, కేసీఆర్ కిట్, కేసీఆర్ సింబల్‌తో పాటు లేటెస్టుగా బూతు బొమ్మలు కూడా పెట్టారని తెలియడంతో ఆ బాధని ఎలా వ్యక్తం చేయాలో తెలియక మీడియా ప్లాట్‌పామ్స్‌పై సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే బ్రహ్మానందం, అలీ వంటి కమెడియన్ల సినిమా క్లిప్పింగ్స్, ఫోటోలు తీసుకుని మేమ్స్ విసురుతున్నారు.
ఇప్పుడు వారికి ఏపీలో మరో టాపిక్ దొరికింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పెద్ద ర్యాలీలో సాగుతుండగా, వాహనం మీదనే సీరియస్‌గా పుస్తకం చదివేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో బాగా తిరిగేసింది. దీనికి కమెంట్లు పెడుతూ జన సేనానిని జనం ఆడేసుకుంటున్నారు. కిందున్న మేమ్ చూడండి.. వారెంతగా ఆడుకుంటున్నారో మీకే తెలుస్తుంది..