నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు. ఈ రెండు రోజుల్లోగా సాయంపై స్పందించకపోతే, ఎలాంటి ప్రకటన చేయకపోతే ఈనెల 7న నిరహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదిలో మూడోసారి పంట నష్టపోయామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారన్న పవన్.. వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్య అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని రైతులకు కేటాయించాలని అన్నారు.
నివర్ తుపాను కారణంగా ఏపీలో పంట నష్టం జరిగిన జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని ప్రభుత్వానికి హితవు పలికారాయన.