కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ద్వారంపూడి మాటలతో భగ్గుమన్న జనసైనికులు ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించటంతో వివాదం మరింత పెద్దదైంది. ద్వారంపూడి ఇంటిని ముట్టడించే క్రమంలో జనసేన, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగటంతో పవన్ స్పందించారు. అక్రమ కేసులు పెట్టడంపై మండిపడుతూ… ఢిల్లీ నుండి నేరుగా కాకినాడ వస్తా, అక్కడే తేల్చుకుంటానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేతలను వదిలి కేవలం జనసేన కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని, అన్యాయంగా 307 కేసు పెడితే నేనే కాకినాడ వస్తా అంటూ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అటు పవన్‌పై, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మండిపడ్డ జనసైనికులు ద్వారంపూడి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లగా అక్కడ వైసీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేయటంతో… పవన్ తీవ్రంగా స్పందించారు.