విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ కేరస్ సెంటర్‌లో ప్రమాదం చోటు చేసుకొని 10 మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాదం బారినపడటం అత్యంత విషాదకరమన్నారు.
మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గాయపడినవారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి,ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి ,ఈ ఘటనకు కారణాలు ఏమిటి లోపాలు ఏమిటో …సమగ్ర విచారణ చేయించాలని ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.