పరిషత్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించిందని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే.. వాటికి బలమైన సమాధానం ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఇక తాజా ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. టీడీపీ, వైసీపీ ప్రస్తావన తీసుకురాలేదు గానీ.. తమ పార్టీకి ఎన్ని సాధించిందో వివరించారు.
జనసేన అభ్యర్థులు 2 జెడ్పీటీసీ, 177 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నారని చెప్పారు పవన్. ఏప్రీల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన అభ్యర్థులు ధీటైన పోరాటం చేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై పార్టీ నాయకులతో విశ్లేషణ చేసి త్వరలోనే స్పందిస్తానంటూ ఓ వీడియో విడుదల చేశారు పవన్.