పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత వరుస సినిమాలను ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్, క్రిష్, సాగర్ కే చంద్ర, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, ఇలా వీళ్లంతా లైన్ లో ఉన్నారు. ఇందులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది.
ఇదిలాఉండగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కొషియం రీమేక్ లో కూడా పవన్ నటించబోతున్నాడు. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటించబోతున్నాడు. పవన్ ను ఈ సినిమాలో హైలెట్ చేసే విధంగా దర్శకుడు కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫ్యాన్ మేడ్ పోస్టర్ లను అభిమానులు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని పవన్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను క్రియేట్ చేశారు. బ్లూ కలర్ షర్ట్, పంచె కట్టు చేతిలో టీ గ్లాస్ తో గడ్డం మీసం తో కనిపించాడు. అయితే దీనికి రుద్ర అనే టైటిల్ ని కూడా ఆ అభిమాని జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.