కొద్దిరోజుల క్రితం 14400 మొబైల్ యాప్ ను ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. దీని ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో అవినీతిని అరికట్టడమే. ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల అవినీతిపై ఫిర్యాదులు చేసేందుకు వీలు కల్పించింది సర్కార్. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే.. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
అయితే.. ఈ యాప్ ప్రారంభం తర్వాత సోషల్ మీడియాలో జగన్ పై విపరీతమైన ట్రోల్ జరిగింది. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి.. జైలులో ఉండొచ్చి.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈయన అవినీతిని అరికడతాడంట అంటూ ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు పెడుతూ ప్రశ్నించాయి.
తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ యాప్ విషయంలో స్పందించారు. జగన్ సర్కార్ పై సెటైరికల్ గా ట్వీట్ చేశారు.
పవన్ చేసిన ట్వీట్
“మరి వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల మీద ఫిర్యాదు చెయ్యాలంటే ప్రజలు ఏ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి?”