దేనికీ గర్జనలు అంటూ రెండు రోజులుగా వైసీపీ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్. జగన్ ఇచ్చిన హామీలేంటి..? అమలు చేసిన తీరు ఏంటి..? అంటూ నిలదీస్తున్నారు. తాజాగా అమెరికాకు, ఆంధ్రాకు లింక్ పెట్టి చురకలంటించారు.
ట్విట్టర్ లో రెండు ఆసక్తికర ఫోటోలను పోస్ట్ చేశారు పవన్. మొదటగా.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని లోని సౌత్ డకొటాలో ఉన్న ‘మౌంట్ రష్‌మోర్’ ఫోటోను ట్వీట్ చేసి.. ఇది ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకి చిహ్నం అని చెప్పారు. ఆ తర్వాత మరో ఫోటో పోస్ట్ చేశారు.
రెండో పోస్ట్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా.. విశాఖ జిల్లాలోని, రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్” ఉందని తెలిపారు. ఇది ధన-వర్గ-కులస్వామ్యానికి చిహ్నం అని సెటైర్ వేశారు. చివరిలో బూతులకి కూడా.. అని ముగించారు.
పవన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. రెండో ఫోటోలో బాక్సైట్, గంజాయి మధ్య వైసీపీ నేతలకు పోటీ జరుగుతోంది అనేలా చూపించారు. ‘‘డోంట్ వర్రీ సార్, మనం కూడా కొంచెం తిట్ల పురాణం మోతాదు పెంచితే, తర్వాతి ఛాన్స్ మనదే’’ అని మాట్లాడుకున్నట్లుగా కార్టూన్ ను క్రియేట్ చేశారు.