అంతా అయిపోయాక పవన్ పునరాలోచన - Tolivelugu

అంతా అయిపోయాక పవన్ పునరాలోచన

Pawan Kalyan Shocking Decision On Pink Remake, అంతా అయిపోయాక పవన్ పునరాలోచన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. అయితే పవన్ వెండితెర కు చాలా కాలం నుంచి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ వెండితెర పై అడుగుపెట్టటానికి సిద్ధం అయ్యాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాని రీమేక్ చెయ్యనున్నారని, అమితాబ్ పాత్ర లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని ప్రచారం జరిగింది. ఈ సినిమాని శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో బోనికపూర్, దిల్ రాజు నిర్మిస్తున్నట్టు కూడా లీక్ లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని ఈ నెలలో ప్రారంభించి 40 రోజుల్లో పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ నిర్మాతలకు మరో షాక్ ఇచ్చాడు. పింక్ సినిమా ఆల్రెడీ బాలీవుడ్, తమిళ్ లో రిలీజ్ అయినా పింక్ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చాలా మంది చూసే ఉంటారని, ఏదైనా కొత్త కథతో వస్తే చేద్దామన్నాడట పవన్ కళ్యాణ్. ఇప్పటికే కథ, స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్న చిత్ర యూనిట్ ఈ సినిమాకు లాయర్ సాబ్ అని టైటిల్ అనుకున్న సంగతి తెలిసిందే.

Share on facebook
Share on twitter
Share on whatsapp