వినాయక చవితి ఉత్సవాలపై నిషేధం ఎందుకు విధించారో అర్థం కావడం లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కరోనా నిబంధనలు ఒక్క వినాయక చవితికే వర్తిస్తాయా..? అని ప్రశ్నించారు. అదే వైసీపీ నేతల వేడుకలకు కరోనా ఆంక్షలు అడ్డురావా..? నిలదీశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు పవన్. జనసేన శతాగ్ని టీమ్ తో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని రోడ్లపై సీఎం జగన్ సమీక్షలో ఎయిర్ పోర్టులు, యార్డుల అభివృద్ధి గురించి మాట్లాడడంపై తనదైన రీతిలో సెటైర్లు వేశారు పవన్. సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కనున్న ఇళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు.
సొంతిల్లు చిమ్మకోడానికి చీపురు లేదు కానీ పక్కింటోళ్ల ఇల్లు చిమ్మేస్తాం, కల్లాపి చల్లేస్తాం, ముత్యాల ముగ్గులేస్తాం అని యెనకటికి ఎవరో అన్నారట, అలా ఉంది @YSRCParty ప్రభుత్వ పరిస్థితి – @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
Interview 👇https://t.co/TGjVvvA50q#JSPForAP_Roads pic.twitter.com/UsJfWsSMYp— JanaSena Shatagni (@JSPShatagniTeam) September 7, 2021
Advertisements
ప్రజల సమస్యలపై జనసేన పోరాటం ఆగదన్నారు పవన్. రోడ్లు బాగుపడే వరకు వెనకడుగేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రులు అంటున్నట్టు ప్రభుత్వం అద్భుతాలే చేసిందని.. చిన్న గోతులను పెద్ద గొయ్యిల్లాగా.. వాటిని కాలువల్లా చేసిందని విమర్శలు చేశారు. ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.