మెగా ఫ్యామిలీ లో పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా ఎంట్రీపై మెగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. గూడచారి, ఎవరు వంటి సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్న అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సోని పిక్చర్ సంస్థతో కలసి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ మూవీ లో అకిరా నందన్ చిన్న క్యామియో రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మేజర్ ఉన్ని కృష్ణన్ చిన్నప్పటి రోల్ లో అఖీరా కనిపిస్తాడని టాక్. అయితే ఆ మధ్య అకిరా అడవి శేషు లు కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.కాగా ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.