పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు
స్వాతంత్ర్య సమరయోధుల ప్రేరణతో జనసేన ముందుకెళ్తుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం.. ఇంకో 25 ఏళ్లు బలంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలి. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు దేశం కోసం ఆస్తుల్ని త్యాగం చేస్తే… ఇప్పుడున్న నాయకులు వారి ఆస్తులను పెంచుకుంటూ ప్రజల ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు. ఇది మారాలి.
ప్రజల ట్యాక్సులతో పథకాలు పెట్టి.. వాళ్ల పేర్లు పెట్టుకోవడం ఏంటి..? దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన వ్యక్తులపై గౌరవం ఉంటే.. వాళ్ల పేర్లు పెట్టుకోరు. ఆ మహానాయకుల పేర్లు పెడతారు. జనసేన అధికారంలోకి వస్తే దేశం కోసం త్యాగం చేసినవారి పేర్లే పథకాలకు ఉంటాయి. మొదట దేశం.. ఆ తర్వాతే జనసేన. ఇది ప్రతీ కార్యకర్త గుర్తు పెట్టుకోవాలి.