జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాయలసీమలో జరిగిన సుగాలి ప్రీతి హత్యపై స్పందించిన పవన్, జగన్ ప్రభుత్వానికి సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రీతీ హత్య కేసులో సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దిశ హత్య కేసుపై అసెంబ్లీలో స్పందించిన జగన్ రాయలసీమలో జరిగిన ప్రీతీ హత్య కేసుపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. రాయలసీమలో జరిగిన విషయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నదంటూ కొంత మంది మాట్లాడుతున్నారు.చంద్రబాబు హయంలో జరిగిన ఈ హత్యపై ప్రతిపక్షం లో ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదని విమర్శయించారు.
రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు స్పందించంచటం లేదని ప్రశ్నించారు. ప్రీతికి న్యాయం జరగకపోతే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని పవన్ హెచ్చరించారు. వెంటనే సుగాలి ప్రీతి కేసును సిబిఐ కు అప్పగించాలని డిమాండ్ చేశారు.