జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుండి ఫోన్ రావటంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషీ ఫోన్ చేసి ఆహ్వానించటంతోనే పవన్ ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ టూర్ లో పవన్ బీజేపీ టాప్ లీడర్లతో సమావేశం కాబోతున్నట్లు జనసేన వర్గాలంటున్నాయి.
ఏపీలో సీఎం జగన్ పాలనపై పోరాటంలో టీడీపీ అనుకున్న స్థాయిలో పోరాడటం లేదని… బీజేపీ-జనసేన మైత్రీ అనుకున్నంత బలంగా ముందుకు సాగటం లేదని… కలిసి ఉద్యమాలు చేసే అంశంపైనే చర్చలకు పిలిచి ఉండొచ్చని ప్రచారం సాగుతుంది. దోస్తీ బలం పెరిగేలా చర్చలుంటయాని, ఇక నుండి వీలైనన్ని ఎక్కువ పోరాటాలకు దిగాలని భావిస్తున్నారు.
ఇటీవల రోడ్ల దుస్థితిపై జనసేన ప్రశ్నించగా మంచి మైలేజ్ వచ్చింది. ఒకరకంగా జగన్ అత్యవసరంగా రివ్యూ చేయాల్సి వచ్చింది. వచ్చే ఏడాది వర్షాకాలం లోపు రోడ్లను బాగు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ప్రజా సంబంధ ఇష్యూలపై పోరాటం చేసేందుకు బీజేపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అవకాశం కనపడుతోంది.