పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చెప్తే యూత్ లో ఉండే జోష్ వేరేలా ఉంటుంది. కానీ గతకొన్నేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టాడు పవన్. ఇప్పుడు మళ్ళీ సినిమాలు వైపుకు వచ్చాడు. అసలు పవన్ ఇక సినిమాలు చేయడేమో అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టడంతో పవన్ ఫాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.
జనసేనపార్టీ నడపాలంటే సినిమాలు తప్పని సరిగా చేయాల్సిందే అన్నది పవన్ ఆలోచన.అందుకే పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టడం ఫిలింనగర్లో హాట్ టాపిక్ గా మారింది. పింక్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నట్టు వచ్చిన వార్తపై పూర్తిగా క్లారిటీ రాకముందే క్రిష్ తో సినిమాని పట్టాలెక్కించేసాడు. నెక్స్ట్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ని కూడా లైన్ లో పెట్టినట్టు సమాచారం.
పవన్ ఇప్పటివరకు తన కెరీర్ లో సినిమాలపై ఇంత దూకుడుగా ఎప్పుడూ లేడని విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ దూకుడుకు కారణం పార్టీ నడపాలంటే డబ్బులు కావాలని, నాకు సినిమాలు చేస్తేనే డబ్బులు వస్తాయంటూ పవన్ మాట్లాడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. అందుకే కాస్త కష్టమైన వరుస సినిమాలను పట్టాలెక్కించినట్టు టాక్.
పవన్ కూడా ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నారని సమాచారం. ఒక్కో సినిమాకు 30కోట్లు కనీసం తీసుకున్నా సుమారుగా 100 కోట్లు వరకు పవన్ సంపాదించినట్టే అవుతుంది. ఈ ఆలోచనతోనే పవన్ వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి.