పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల విరామం తరువాత కెమెరా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా పవన్ ఒకే చెప్పాడు. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తుండగా…మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వం లో చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ సినిమా కథను హరీశ్ సిద్ధం చేస్తున్నారు. పవన్ తో సినిమా విషయమై హరీష్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. లేటెస్ట్ సమాచారం మేరకు హరీశ్ మరోసారి పవన్‌కల్యాణ్‌ను పోలీస్ పాత్రలోనే చూపించబోతున్నారని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ లో పవన్‌కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది.